
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు, ఎంపి సోనియా గాంధీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జ్వరంతోపాటు స్వల్ప అనారోగ్యం కారణంగా మార్చి 24న రాత్రి 10 గంటల సమయంలో సోనియా గాంధీ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్ డి.ఎస్. రాణా, డాక్టర్ ఎస్. నంది, డాక్టర్ అరూప్ బసుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించగా, ఆమె చికిత్సకు బాగా స్పందించారని సర్ గంగా రామ్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. చికిత్స అనంతరం ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, సోనియా తన నివాసంలో కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.