
పిల్లల్లో ఐరన్ (ఇనుము) లోపం అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఎదుగుదల, శక్తి ,మెదడు అభివృద్ధికి ఇది ఎంతో అవసరం. శరీరంలో హిమోగ్లోబిన్ తయారు కావడానికి ఐరన్ చాలా అవసరం. ఇది సరిగ్గా లేకపోతే రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా తగ్గి, శరీరం త్వరగా అలసిపోతుంది. కేవలం సరైన ఆహారపు అలవాట్ల ద్వారా ఈ లోపాన్ని, దాని వల్ల కలిగే అలసటను నివారించవచ్చంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో ఐరన్ లోపం రాకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.
పిల్లలకు ఐరన్ ఎందుకు అవసరం?
పిల్లలు పెరిగే దశలో ఉన్నప్పుడు కొత్త కణాలు, కండరాలు, మెదడు అభివృద్ధికి ఐరన్ ఎంతో అవసరం. ఐరన్ తక్కువగా తీసుకున్నప్పుడు, శరీరం తన వద్ద ఉన్న నిల్వలను వాడుకుంటుంది. ఇది చివరకు ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనతకు (Anemia) దారితీస్తుంది.
లక్షణాలు: అలసట, పాలిపోయిన చర్మం, ఏకాగ్రత లోపించడం , ఎదుగుదల ఆలస్యం కావడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. నవీ ముంబైలోని ఖార్ఘర్ ప్రాంతానికి చెందిన పీడియాట్రిషియన్ , నియోనాటాలజిస్ట్ డాక్టర్ అమిత్ పి. ఘవాడే ఐరన్ లోపం కీలక విషయాలు వెల్లడించారు.
తల్లిదండ్రులు తరచుగా విస్మరించే పోషకాల్లో ఐరన్ ఒకటి.. ఇది పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ తగినంతగా అందకపోతే పిల్లలు త్వరగా అలసిపోవడం, చిరాకు పడటం, ఎదుగుదల మందగించడం , చదువులో ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.
తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు
విటమిన్ సి కలయిక..ఐరన్ శరీరానికి బాగా పట్టాలంటే, ఐరన్ ఉన్న ఆహారంతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, టమోటాలు లేదా బెల్ పెప్పర్స్ (క్యాప్సికమ్) వంటివి ఇవ్వాలి.
ALSO READ : ఉప్పిడి పిండి.. సజ్జ రొట్టె.. బలంతో పాటు ఆరోగ్యం కూడా..!
కాల్షియం విషయంలో జాగ్రత్త..పాలు లేదా పెరుగు వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను ఐరన్ ఉన్న భోజనంతో పాటు ఇవ్వకూడదని డాక్టర్ చెబుతున్నారు. ఎందుకంటే కాల్షియం ఐరన్ శోషణను అడ్డుకుంటుందంటున్నారు.
సరైన ప్రణాళిక: చిన్నపాటి మీల్ ప్లానింగ్ ద్వారా పిల్లల్లో ఐరన్ లోపాన్ని సులభంగా నివారించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.