
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. గత మూడేళ్ళలో ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’, ‘అఖండ 2’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు అంతకుమించి అనేలా బాలయ్య తన నెక్స్ట్ సినిమాలు లైన్లో పెట్టేశాడు. ఇప్పటికే, ‘వీర సింహారెడ్డి’ మూవీని తెరకెక్కించిన గోపి చంద్ మలినేనితో ‘NBK111’ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీగా గడుపుతున్నారు.
NBK112 – కీలక అప్డేట్!
మరోవైపు బాలయ్య కోసం కథలు రెడీ చేస్తున్నారు తెలుగు దర్శకులు. ఇందులో భాగంగా మొదట కన్ఫామ్ అయ్యేది.. సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సినిమా. ఆ తర్వాత హరీష్ శంకర్, ‘మార్కో’ డైరెక్టర్ హనీఫ్ అదేని, కొరటాల శివ లైన్లో ఉన్నట్లుగా టాలీవుడ్లో క్రేజీ టాక్. ఈ క్రమంలోనే ‘NBK112’ టైటిల్ రివీల్ అయింది.
‘NBK112’ టైటిల్:
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ-నటసింహం బాలకృష్ణ కాంబోలో ‘NBK112’ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం మాస్-క్లాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమాకు ‘కురుక్షేత్రం’ (Kurukshetram) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
మహాభారత నుంచి స్ఫూర్తి పొందిన యాక్షన్ డ్రామాగా ఉండనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కథలో ప్రధాన పాత్రలు గంభీరంగా, బలమైన వ్యక్తిత్వాలతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మహాభారతంలోని కీలక పాత్రల తరహాలో ప్రతి క్యారెక్టర్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుందని టాక్.
బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తూనే, పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో, ఆత్రేయ తనకు ప్రత్యేకమైన స్టైలిష్ స్క్రీన్‌ప్లే మరియు క్లాస్ ట్రీట్‌మెంట్‌తో సినిమాను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మాస్-క్లాస్ మిక్స్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ : లైంగిక వేధింపుల కేసులో దర్శకుడు రంజిత్ అరెస్ట్..
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా, ‘సరిపోదా శనివారం’తో వంద కోట్ల బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న వివేక్ ఆత్రేయ, బాలకృష్ణను కొత్త లుక్‌లో ఎలా ప్రెజెంట్ చేస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.