
భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. కొన్ని క్షేత్రాల పురాణాలు వింటుంటే ఆశ్చర్యంతో పాటు భక్తిభావం కలుగుతుంది. అచ్చం విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకకు కృష్ణా నది నీరు తగిలితే ప్రళయం వస్తుందనే ప్రచారం ఎలా ఉందో.. కడప జిల్లాలో కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన ‘యుగాంతం’ కథ ప్రచారంలో ఉంది. అదే కమలాపురం నియోజకవర్గంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయం. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభంపై చిట్టచివరన ఒక చిలుక విగ్రహం ఉంటుంది. స్థల పురాణం ప్రకారం.. ఆలయం పక్కనే ప్రవహించే పెన్నానదిగా పిలుచుకునే పాపాగ్ని నది నీరు ఎప్పుడైతే ఉధృతమై ఆ ధ్వజస్తంభంపై ఉన్న చిలుకను తాకుతుందో, అప్పుడు ఆ చిలుకకు ప్రాణం వచ్చి ఎగిరిపోతుందట. అలా ఆ చిలుక ఎగిరిన క్షణమే ఈ సృష్టికి ‘యుగాంతం’ అని స్థలపురాణం చెబుతుంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదని, సాక్షాత్తు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఈ విషయం గురించి రాసి ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. నది నీరు పెరిగి ధ్వజస్తంభం శిఖరాన్ని తాకడం అంటే ప్రకృతి ప్రకోపానికి సంకేతమని, అది యుగాంతానికి దారితీస్తుందని భక్తుల నమ్మకం. ఎంతో మహిమ గల ఈ సంగమేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ అడుగుపెడితే మనసు తేలికపడుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు
సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం
Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్.. కారణం ఇదే