Reading Time: < 1 minute
Bengaluru Man Accuses Wife Sexual Torture Harassment Fir Filed

S*exual Torture: బెంగళూర్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తన భార్య లైంగికంగా వేధిస్తోందని, బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించాలని చూస్తోందని ఫిర్యాదు చేశారు. 37 ఏళ్ల వ్యక్తి, తన అత్తమామలు కూడా తన సంసారంలో జోక్యం చేసుకుంటున్నారని, దీని వల్ల తరుచుగా గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు.

నాగరభావి నివాసి అయిన ఫిర్యాదుదారులు, 31 ఏళ్ల శిల్పను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత జక్కూర్‌లో ఒక విల్లాకు మారాడు. ఇప్పుడు తన అత్త ఆశా తను ఇంట్లోకి రానీవ్వకుండా చేస్తోందని ఆరోపించాడు. తన అత్త తన కూతురుకు వేరే వరుడిని వెతకడం ప్రారంభించిందని, తన కూతుర్ని వదిలేయాలని రెచ్చగొడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన మామ మాధవ్ కృష్ణ తనను మనుషులతో బెదిరిస్తున్నట్లు చెప్పాడు.

Read Also: PF Interest Hike: ఈపీఎఫ్ఓ వడ్డీ 10 శాతానికి పెంపు..? మంత్రి ఏమన్నారంటే..

తన భార్య, తన ఆర్థిక స్థితిని ఎగతాళి చేస్తోందని, తన భార్య ధనవంతులైన స్నేహితులలో సమయం గడుపుతూ, తరుచుగా పార్టీలు, ఆల్కాహాల్ సేవిస్తోందని ఆరోపించారు. తనపై లైంగిక వేధిపులు, మానసిక క్రూరత్వానికి గురిచేస్తుందని చెప్పాడు. తనకు అసభ్యకరమైన వీడియోలు పంపి అలా చేయాలని ఒత్తిడి చేస్తుందని, తన స్నేహితురాలితో సెక్స్ చేయాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పాడు. తన మాజీ ప్రియులతో సంబంధాలు పెట్టుకున్నట్లు తన భార్య ఒప్పుకుందని వెల్లడించారు.

పెద్ద మనుషుల పంచాయతీ పెట్టించిన తర్వాత, తనను ఇంటి నుంచి గెంటేశారని, తన నగలు, పాస్‌పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లను విల్లాలోనే ఉంచారని, వాటిని చట్టవిరుద్ధంగా నిలిపేసినట్లు ఆరోపించారు. తనను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నట్లు చెప్పారు. తన వస్తువులను తిరిగి ఇప్పించేలా పోలీసులు జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, అతడి భార్య కూడా తన స్వస్థలం చెన్నైలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.