
IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్‌కు దూరమైన లెజెండరీ వికెట్ కీపర్, బ్యాటర్ మహేంద్ర సింగ్, ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్న వీడియోను సీఎస్‌కే అధికారికంగా విడుదల చేసింది. దీంతో ఏప్రిల్ 5వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీతో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ బరిలోకి దిగడం ఖాయమని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.
తొలి మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యారంటే?:
పిక్క కండరాల గాయం (Calf Injury) కారణంగా ఎంఎస్ ధోనీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమయ్యారు. 2019 తర్వాత ధోనీ ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు దూరం కావడం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ధోనీ లేకపోవడం జట్టు బ్యాటింగ్‌పైనే కాకుండా, మైదానంలో వ్యూహాలు రచించడంపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఆర్‌సీబీతో మ్యాచ్ కీలకం?:
44 ఏళ్ల ధోనీ బ్యాటింగ్‌లో మునుపటిలా మెరుపులు మెరిపించకపోయినా, వికెట్ల వెనుక ఉండి అతడు చేసే వ్యూహాలు జట్టుకు కొండంత అండగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి ఆటగాళ్లను అడ్డుకోవడానికి ధోనీ చతురత అవసరమైంది.
రికార్డులు:
ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 35 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 21 సార్లు విజయం సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది. గత సీజన్‌లో (2025) ఆర్‌సీబీ రెండుసార్లు చెన్నైని ఓడించడం గమనార్హం.
కోహ్లీ vs ధోనీ:
ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలో తలపడటం చూడాలని క్రికెట్ అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగానే ఎదురు చూస్తుంటారు.
రిపోర్ట్స్:
ఎంఎస్ ధోనీ కోలుకోవడానికి ఏప్రిల్ నెలాఖరు వరకు సమయం పడుతుందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఆ వార్తలను పటాపంచలు చేస్తున్నాయి. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో ఉంటారో లేదో అనేది రేపు తెలుస్తుంది. కానీ బెంగళూరుతో మ్యాచ్‌కల్లా ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం మాత్రం ఉంది.
Kodiyil Oruvan! 🦁💛#WhistlePodu #Yellove pic.twitter.com/SuztJYGNzr
— Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2026