Reading Time: 2 minutes
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

అసోంలో క్షుద్ర విద్యలకు పేరొందిన మాయోంగ్ గ్రామానికి ప్రస్తుతం నేతలు క్యూ కడుతున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 9న జరగనున్నాయి. కొందరు అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనితో పాటు, మంత్రతంత్రాలతో గెలుపును దక్కించుకోవాలని మాయోంగ్ బాట పడుతున్నారు. గౌహతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం మంత్రతంత్రాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వచ్చే నేతలు ఓట్లు అడగడానికి రారని, ‘విజయ ప్రాప్తి’ కోసం క్షుద్ర పూజలు చేయించుకునేందుకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. . ఇక్కడ్నుంచి బీజేపీ తరపున మంత్రి పిజూష్ హజారికా, కాంగ్రెస్ నుండి బబుల్ దాస్ పోటీ పడుతున్నారు. పిజూష్ హజారికా పది రోజుల క్రితమే తన కుటుంబంతో కలిసి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మాయోంగ్‌లో ఉన్న మూడు వేల జనాభాలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక మంత్రగాడు ఉంటాడని చెబుతారు. వారసత్వంగా వస్తున్న తంత్ర విద్యను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ‘మా వద్దకు జబ్బులు తగ్గించుకోవడానికి, మానసిక సమస్యల నివారణకు చాలామంది వస్తుంటారు. రాజకీయ నేతలు కూడా వస్తుంటారు. అయితే ఎవరినైనా ఓడించడానికైనా పూజలు చేయమంటే మేము ఒప్పుకోం. వచ్చే ప్రతి వ్యక్తి వివరాలను ఒక డైరీలో నమోదు చేస్తాం’ అని స్థానిక తంత్రవేత్త విపుల్ మేధి తెలిపారు. 100 ఏళ్ల వయసున్న జంతు మండల్ అనే వృద్ధ మంత్రగాడు మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి కూడా నేతలు వచ్చి మంత్రి పదవుల కోసం పూజలు చేయమని తమను అడుగుతారని, కానీ తాము కేవలం స్వస్థత చేకూర్చే పనులు మాత్రమే చేస్తామని అన్నారు. ఈ గ్రామానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. శత్రువులను గాలిలో మాయం చేయడం, మనుషులను జంతువులుగా మార్చడం వంటి శక్తులు ఇక్కడి వారికి ఉన్నాయని స్థానికుల నమ్మకం. ఇక్కడ 18వ శతాబ్దం వరకు నరబలి కూడా జరిగేదని, బ్రిటిష్ వారు దానిని నిషేధించారని తెలుస్తోంది. అయితే, ప్రస్తుత తరం ఈ విద్యలకు దూరంగా ఉంటోంది. గ్రామంలోని యువత ఇప్పుడు కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతోంది.‘మా పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయ నేతలు కూడా గెలిచాక మా పిల్లలకు ఉపాధి కల్పించాలి’ అని స్థానిక మహిళలు కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం

విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య టీవీఎస్‌ మోపెడ్‌