
జ్యోతిష శాస్త్రం ప్రకారం 9వ స్థానాధిపతిని భాగ్య స్థానాధిపతిగా పరిగణించడం జరుగుతుంది. భాగ్య స్థానాధిపతినే అదృష్ట స్థానాధిపతిగా కూడా భావిస్తారు. ఈ అధిపతి మీదే బట్టే ‘లక్’ అనేది ఆధారపడి ఉంటుంది. జాతక చక్రంలో ఈ స్థానాధిపతి బలంగా ఉంటే ఇక ఆ జాతకుడి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. జాతకంలో ఎన్ని దోషాలున్నా, ఎన్ని లోపాలున్నా కొట్టుకుపోతాయి. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకర రాశుల వారికి మరో నెల రోజుల పాటు ఏప్రిల్ నెలంతా అదృష్టం బాగా కలిసి రాబోతోంది.
- మేషం: ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన గురువు ప్రస్తుతం తృతీయ స్థానంలో సొంత నక్షత్రమైన పున ర్వసులో ఉండి భాగ్య స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడానికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.
- వృషభం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. జీత భత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిత్రార్జితం లభించవచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
- మిథునం: ఈ రాశికి ఈ నెలంతా ఏదో రూపేణా భాగ్య లక్ష్మి కరుణిస్తూనే ఉంటుంది. ఈ రాశికి భాగ్యస్థానమైన కుంభ రాశి మీద గురువు దృష్టి పడడంతో పాటు, భాగ్యాధిపతి శని దశమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన కుజుడు మిత్రక్షేత్రంలో ఉండడం, భాగ్య స్థానంలో రవి, శుక్రులు కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి గ్రహం ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఏప్రిల్ లో ఆదాయపరంగా, అధికారపరంగా దశ తిరిగే అవకాశం ఉంది. భాగ్య కారకుడైన గురు గ్రహం సప్తమ స్థానంలోనే ఉండడం ఊహించని అదృష్టాలను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణ నీయంగా మెరుగుపడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదే వీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ధన వర్షం కురిపిస్తాయి.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన బుధుడు ఏప్రిల్ నెలలో మీన రాశిలోకి ప్రవేశించి గురువుతో పరివర్తన చెందుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా, ఆదాయపరంగా తప్పకుండా అదృష్టాన్ని కలుగజేస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు మటుమాయమవుతాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయాన్నిచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.