Reading Time: < 1 minute

డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం..ఈగల్ ఫోర్స్ AI వెబ్ సైట్ ప్రారంభం

Caption of Image.

డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ఆయుధంగా మార్చుకుంది. మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ఈగల్ ఫోర్స్ AI వెబ్‌సైట్‌ ను  తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి  అధికారికంగా ప్రారంభించారు.డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం, ఫిర్యాదులను స్వీకరించడం , బాధితులకు తక్షణ సహాయం అందించడం కోసం ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఇందులో SAHAY AI, SHIELD AI,  MITRA-TG వంటి అత్యాధునిక AI టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి యూజర్లకు 24/7 మార్గదర్శకంగా పనిచేస్తాయి.

ఈ వెబ్‌సైట్ ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, డ్రగ్ రిస్క్ అంచనా సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా డ్రగ్ ట్రాఫికింగ్, దుర్వినియోగంపై సమాచారం తెలిస్తే తమ వివరాలు గోప్యంగా ఉంచి రహస్యంగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఒకవేళ ఎవరైనా బానిసలైతే వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్లు, డీ-అడిక్షన్ సపోర్ట్ వివరాలను కూడా ఇందులో పొందుపరిచారు.

ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త తెలంగాణ లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ ముందడుగు వేస్తోంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవాలని పోలీస్ యంత్రాంగం పిలుపునిచ్చింది. 

©️ VIL Media Pvt Ltd.