Reading Time: < 1 minute
Biker And Rakasa Telugu Movies Box Office Outlook Dhurandhar Slows Down

గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యం వహించిన రణవీర్ సింగ్ ‘ధురందర్2’ వసూళ్లు ఇప్పుడు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాల్లో హిందీ, తెలుగు వెర్షన్లలో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండో వారంలోకి ప్రవేశించే సరికి స్క్రీన్లను ఖాళీ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయం మన తెలుగు చిత్రాలైన ‘బైకర్’, ‘రాక్షస’లకు వరంగా మారింది. థియేటర్ల కౌంట్ పెరగడమే కాకుండా, ప్రేక్షకుల దృష్టి కూడా ఇప్పుడు ఈ కొత్త సినిమాలపైనే ఉంది.

‘బైకర్’,‘రాక్షస’ చిత్రాలు ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లతో ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని పెంచగా, ముఖ్యంగా యూత్ ‘బైకర్’ కోసం ఎదురుచూస్తుంటే, మాస్ ఆడియన్స్ ‘రాక్షస’పై అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాల భవితవ్యం రేపు రాబోయే ‘మౌత్ టాక్’ పైనే ఆధారపడి ఉంటుంది. కంటెంట్ గనుక క్లిక్ అయితే, సమ్మర్ సీజన్ ఆరంభంలో ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం. మొత్తానికి ‘బైకర్’, ‘రాక్షస’ చిత్రాలకు బాక్సాఫీస్ బరిలో లైన్ క్లియర్ అయిపోయింది. మరి ఈ సినిమాలు ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి.