Reading Time: < 1 minute

ఏకానా క్రికెట్ స్టేడియం వేదకిగా లక్నో జట్టుతో జరుగుతున్న తొలి పోరులో.. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(0), నిస్సాంక(1)తోపాటు నితీశ్ రానా(15), అక్షర్ పటేల్(0)లు విఫలమయ్యారు. దీంతో 25 పరుగులకే ఢీల్లీ నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ 40/4తో కొనసాగుతోంది. క్రీజులో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (8), సమీర్‌ రిజ్వీ(2)లు ఉన్నారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మోహ్సిన్‌ ఖాన్‌, షమీలు చెరో వికెట్ తీశారు.