Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాజధాని అ మరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టా రు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సు దీర్ఘ చర్చలో వైసిపి మినహా అన్ని పార్టీలు సమర్థించాయి. పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, 2024 జూన్ 2 నుండి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించేలా ఈ బిల్లులో నిబంధనలను చేర్చారు. ఈ బిల్లు ఆమోదంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించినట్లయింది. ఈ చర్చలో  ఇండీ కూటమి అనూహ్యం గా బిల్లుకు మద్దతు ప్రకటించడం విశేషం. కాంగ్రె స్ పార్టీ తరపున మాణికం ఠాగూర్ వంటి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఏర్పాటు ఉండాలని, అమరావతి కి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

కేవలం రాజకీయాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. దీంతో బి ల్లుపై చర్చలో మెజారిటీ పార్టీలన్నీ ఏకతాటిపైకి వ చ్చి సానుకూలత వ్యక్తం చేశాయి. అయితే, వైసిపి మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. వై సిపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ చర్చకు సమాధానమిస్తూ ఎపి అసెంబ్లీ తీర్మానం మేరకే ఈ సవరణ చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు , ఇతర విభజన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లును ఆమోదించారు. గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రాజ్యసభలో ఆమోదం తర్వాత రాష్ట్రపతికి పంపుతారు . అక్కడ తుది ఆమోదం తరవాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దాంతో ఎపి రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది. మళ్లీ మార్చా లంటే పార్లమెంట్‌లోనే చట్టం చేయాల్సి ఉంటుంది.

రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది : చంద్రబాబు

అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలిగిపోయి అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని సిఎం పేర్కొన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది అని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి అని వెల్లడించారు. అమరావతి ఇక అజేయం. అజారామరమన్నారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని స్పష్టం చేశారు. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. లోక్‌సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకూ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు అని సిఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ‘తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను‘ అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.