
Ravichandran Ashwin on Vaibhav Sooryavanshi: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసిన వైభవ్ ఆటతీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఈ ప్రదర్శన తర్వాత అతడిని జాతీయ జట్టులోకి ‘ఫాస్ట్ ట్రాక్’ చేయాలని కొందరు నిపుణులు కోరుతున్నారు. అయితే, తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. వైభవ్‌పై ఇప్పుడే అంచనాల భారం వేయవద్దని సూచించాడు.
“అతనికి ఇప్పుడే లక్ష్యాలు నిర్దేశించకండి. అతను ఇంకా పిల్లాడే. ఒకవేళ ఎంఎస్ ధోనీ 44 ఏళ్ల వరకు ఆడితే, వైభవ్ 40 ఏళ్ల వరకు ఆడినా అతనికి ఇంకా రెండున్నర దశాబ్దాల క్రికెట్ కెరీర్ మిగిలి ఉంది. అతడిని ప్రశాంతంగా వదిలేయండి, సమయం వచ్చినప్పుడు అతనే తన సత్తాతో భారత జట్టులోకి వస్తాడు. అతను టీమ్ ఇండియాకు ఆడటంలో సందేహం లేదు, కానీ అంత తొందర ఎందుకు?” అని అశ్విన్ ప్రశ్నించాడు.
వైభవ్ బ్యాట్ స్పీడ్‌పై ప్రశంసల జల్లు..
తన మాజీ జట్టుపై వైభవ్ చేసిన దాడిని అశ్విన్ కొనియాడాడు. వైభవ్ బ్యాట్ స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని, అతని వద్ద ఉన్న ఆత్మవిశ్వాసం అసాధారణమని పేర్కొన్నాడు. 15 ఏళ్లు నిండిన కొద్ది రోజుల్లోనే, 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది తన వయస్సును స్కోరు బోర్డుపై చూపించాడని చమత్కరించాడు.
“వైభవ్ దాటికి సీఎస్‌కే బౌలర్ల వద్ద సమాధానం లేదు. మైదానంలో వారు పూర్తిగా డీలా పడిపోయారు. రాజస్థాన్ రాయల్స్ ఈ ప్రదర్శన ద్వారా తాము కూడా ఈ టోర్నీలో అత్యంత శక్తివంతమైన జట్టు అని చాటిచెప్పారు” అని అశ్విన్ విశ్లేషించాడు.
యువ ప్రతిభను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే..
ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం అనేది పెద్ద సవాల్ అని అశ్విన్ గుర్తు చేశాడు. ఒత్తిడిని తట్టుకోవడం, నిలకడగా రాణించడం, వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారడం నేర్చుకోవడానికి సమయం పడుతుందన్నాడు. వైభవ్ లాంటి అరుదైన ప్రతిభను అతిగా ఒత్తిడికి గురిచేయకుండా, సహజంగా ఎదిగేలా చూడటమే భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
రాజస్థాన్ రాయల్స్ తదుపరి పోరు..
తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు తమ రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 4న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ తన జోరును కొనసాగిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..