Reading Time: < 1 minute
Telangana Cricket Association Files Complaint With Ed Black Marketing Of Ipl Passes And Tickets

ఐపీఎల్ పాస్ లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈడీ కి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు.. ఐఐపీఎల్ టికెట్లు, పాస్ లు బ్లాక్ మార్కెట్ వైపు మళ్లించారని.. కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గత 10 ఏళ్లలో దాదాపు 600 కోట్ల వరకు అవినీతి జరిగిందని.. HCA ఖాతాలు, లావాదేవీలను పరిశీలించాలని కోరింది.

Also Read:Minister Narayana: మూడు ముక్కలాట ముగిసింది.. 2028 ఆగస్టుకి అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం!

ప్రభుత్వ సంస్థల క్రికెట్ క్లబ్ లను ఒక్కొకటి 2 నుంచి 2.5 కోట్లకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, తప్పుడు ఖాతాల నమోదు, నకిలీ పత్రాలతో పెద్ద ఎత్తున స్కాం లు జరిగాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు లో పేర్కొన్నది. GHMC/MCHకి చెందిన 17 క్రికెట్ క్లబ్‌లను అక్రమంగా ప్రైవేటీకరించి, ప్రతి క్లబ్‌ను.. ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపించింది. 103 ఒరిజినల్ క్లబ్ లను మాయం చేసి.. 80 కి పైగా నకిలీ క్లబ్ లను HCA లో చేర్చారని ఫిర్యాదులో పేర్కొంది.