
ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటి మిట్టలోని సీతా రాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఈ వేడుకకు హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఇక ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్టం ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణ వేదికకు ఎదురుగా 120 గ్యాలరీలు ఏర్పాటు చేసింది. గ్యాలరీల్లో కూర్చొనే భక్తులకు తీర్థప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్ల కిట్‌తో పాటు ఈసారి లడ్డూ ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తున్నారు. 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు.