
ఇల్లు నిర్మించుకొనే విషయంలో కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం. ఇంటిప్లాన్ విషయంలో కచ్చితంగా వాస్తు పండితుల సలహాలు తీసుకుంటాం. . .. బాత్రూం ఎక్కడ కట్టుకోవాలి మరి గోడలు ..పిట్టగోడలు కూడా వాస్తు ఉంటుందా.. .. మొదలగు విషయాలగురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ఇస్తున్న సూచనలను ఒకసారి పరిశీలిద్దాం. . .!
ప్రశ్న : ప్రస్తుతం మేము ఉంటున్నది అద్దె ఇల్లు. ఆ ఇంట్లోకి దిగి రెండేళ్లైంది. మొదట బాగానే ఉన్నా, ఇప్పుడు చిన్నచిన్న ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. అయితే మా ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరూ మీ బాత్రూమ్ నైరుతిలో ఉందేంటి? అక్కడ ఉందొద్దు కదా? అంటున్నారు. అది నిజమేనా? అందుకే మాకు ఇబ్బందులు వస్తున్నాయా? అసలు బాత్రూమ్ ఏ మూల ఉండాలి?
జవాబు: బాత్రూమ్ ఎక్కడుండాలన్న విషయంలో ఎప్పుడూ సందేహాలు ఉంటూనే ఉంటాయి. వాయువ్యం, ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే మంచి జరుగుతుంది. నైరుతిలో గొయ్యి ఉండకూడదు. అందుకే బాత్రూమ్ ఆ మూల ఉంటే అన్ని రకాల సమస్యలూ వస్తాయి. మరో ముఖ్యం విషయం, మెట్ల కింద మాత్రం బాత్రూమ్ ఉండొద్దు. కానీ చాలామంది ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లడానికి కట్టే మెట్ల కింద, జాగా కలిసొస్తుందని కడతారు. బాత్రూమ్లో గుంట, నీళ్లు ఉంటాయి. కాబట్టి వాటిపై నుంచి నడవకూడదు. అది అన్నివిధాలా అరిష్టమేనని వాస్తు కన్సల్టెంట్ కాశీ నాధుని శ్రీనివాస్ చెబుతున్నారు.
ప్రశ్న :గోడల వల్ల దోషాలు ఉంటాయా?పునాదులు, గోడలు, పిట్టగోడలను శాస్త్రబద్ధంగా నిర్మించాలని, లేదంటే దోషాలు కలుగుతాయని పూజారి చెప్పాడు. గోడల వల్ల గృహానికి ఎలాంటి దోషాలు ఉంటాయి. ఇదెంతవరకు నిజం?
జవాబు: దోషాలు అంటూ ఏమి ఉండవు. వాస్తు ప్రకారం ఎలాగైతే ఇల్లు కట్టుకున్నారో ప్రహరీ, కాంపౌండ్ అలాగే ఉండాలి. ఇంటికి ఆనుకొని ఇతరుల ఇళ్లు కూడా ఉంటాయి. ఆ ప్రభావం కచ్చితంగా ఇంటిపై పడుతుంది. కాబట్టి బేస్మెంట్ ఫర్ ఫెక్ట్ గా ఉండేలా మార్పులు చేసుకోవాలి. సొంతింటికి హద్దులు ఉంటే మంచిదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.