
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల వద్ద 24.45 కిలోల హైడ్రోపోనిక్ ( గాంజా) ను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఎయిరోపోర్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించిన డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్
అధికారులు నిందితుల లగేజీ బ్యాగేజ్ లో ఆకుపచ్చిని రంగులో ప్యాకెట్లు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్ష చేయగా హైడ్రోపోనిక్ (గంజా) గా తేలింది . హైడ్రోపోనిక్ (గాంజా) స్వాధీనం చేసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ విలువ 8.9 కోట్లు ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు అంచనా వేశారు.