Reading Time: < 1 minute

శ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్

Caption of Image.

చంఢీఘర్: ఐపీఎల్ 19లో భాగంగా గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన మ్యాచులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్సింగ్స్‎లో రషీద్ ఖాన్ వేసిన 11 ఓవర్ 5వ బంతిని ఓపెనర్ కూపర్ కానలీ స్ట్రైట్ హిట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైక్ ఎండ్‎లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కుడిచేతి మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో అయ్యర్ నొప్పితో అల్లాడిపోయాడు. గ్రౌండ్‎లో నేలపై పడుకోని నొప్పితో విలవిలాడిపోయాడు.

 వెంటనే గ్రౌండ్‎లోకి పరిగెత్తుకొచ్చిన పంజాబ్ ఫిజియోలు అయ్యర్ పరీక్షించారు. బంతి తగిలిన చోట ఐస్‌ ప్యాకులు పెట్టడంతో పాటు పెయిన్ రిలీఫ్ స్ర్పే కొట్టారు. నొప్పితోనే తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన అయ్యర్ (18) కాసేపటికే ప్రసిద్ కృష్ణ బౌలింగ్‎లో వాషింగ్టన్ సుందర్‎కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయ్యర్ గాయం తీవ్రంగా ఉంటే మాత్రం పంజాబ్‎కు ఇది భారీ ఎదురు దెబ్బే. 

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే ఆల్ రౌండ్‎తో అదరగొట్టిన పంజాబ్ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‏ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. గిల్ 39, బట్లర్ 38, ఫిలిప్స్ 25 రన్స్ చేశారు. విజయ్ వైశాఖ్ మూడు వికెట్లతో రాణించగా.. చాహల్ రెండు వికెట్లు, యాన్సెన్ ఒక వికెట్ తీశారు. అనంతరం జీటీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ విజయవంతంగా ఛేదించి గెలుపుతో టోర్నీని ఆరంభించింది. 

 

©️ VIL Media Pvt Ltd.