
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది లక్నో. ఈ మ్యాచ్ లొ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్‌క్రమ్ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది.
మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్(37)లు పర్వాలేదనిపించారు. స్టార్ బ్యాటర్ పూరన్(8) విఫలమయ్యాడు. దీంతో లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.