Reading Time: 2 minutes

IPL 2026: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో ఫస్ట్ బ్యాటింగ్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధమైంది. ల‌క్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సందర్భంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేస్తాం.. ఇది సీజన్‌లో మాకు మొదటి మ్యాచ్.. ఈ పిచ్ తాజాగా ఉంది, ఎర్ర మట్టితో నిండిన ఈ వికెట్ మొదటి 6 ఓవర్లలో బౌలర్లకు సహకరిస్తుందని భావిస్తున్నాం.. గణాంకాల ప్రకారం ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది తొలి మ్యాచ్ కావడంతో మేము బౌలింగ్‌కే మొగ్గు చూపాం.. గత సీజన్‌లో మేము బాగానే ఆరంభించినా మధ్యలో తడబడ్డాం.. ఈసారి పాత విషయాల గురించి ఆలోచించకుండా ముందుకెళ్తామని పటేల్ పేర్కొన్నారు.  

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. టాస్ గెలిచినా ఓడినా ఇలాంటి వికెట్‌పై పెద్దగా తేడా ఉండదు.. మంచు ప్రభావం (Dew Factor) ఉంటుందని నేననుకోవడం లేదు.. ఈసారి మా జట్టు లోగో, జెర్సీ రంగు అన్నీ కొత్తగా ఉన్నాయి.. జట్టులో అందరూ ఫిట్‌గా ఉన్నారు, ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు.. గత సీజన్‌లో గాయాల సమస్యలు వేధించినా, ఒక కెప్టెన్‌గా వాటి గురించి ఆలోచించలేం.. ఈసారి మా కుర్రాళ్లు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారని పంత్ వెల్లడించారు.  

తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నార్జే, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీ

ఢిల్లీ క్యాపిటల్స్: KL రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్స్: అశుతోష్ శర్మ, ఔకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్

 

 

 

©️ VIL Media Pvt Ltd.