Reading Time: < 1 minute

న్యూ ఛండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే విజయోత్సాహంతో ఉన్న పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్‌కు ఐపిఎల్ షాక్ ఇచ్చింది. అతడికి భారీ జరిమానాను విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 18 పరుగులు మాత్రమే చేసి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. కానీ, కెప్టెన్‌గా మాత్రం జట్టును సమన్వయం చేస్తూ.. గెలుపు దిశగా అడుగులు వేయించాడు.

అయితే పంజాబ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యరు జరిమానా విధిస్తున్నట్లు ఐపిఎల్ ప్రకటించింది. ‘‘గుజరాత్ టైటాన్స్‌తో జరిచిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించడమైనది. సీజన్‌లొ ఇది తొలి తప్పిదం కాబట్టి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం రూ.12 లక్షలఫఫర ఫైన్‌తో సరిపెట్టాము’’ అని పేర్కొంది.