Reading Time: < 1 minute

 ఐపిఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. సమీర్ రిజ్వీ(70) 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడటంతో 6 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలుండగానే అందుకుంది. రిజ్వీకితోడు త్రిస్టన్ స్టబ్స్ సయితం బ్యాట్ ఝులిపించడంతో విజయ లాంచనం పూర్తయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాద్ రెండు వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, మొసిన్ ఖాన్ చెరు వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రిషభ్ పంత్(7) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్నవుట్‌గా వెనుదిరిగాడు.

మిచెల్ మార్ష్(35)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. ఎయిడెన్ మార్క్మ్(్ర11)ను అక్షర్ పెవిలియన్ చేర్చాడు. డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్(8)ను ఎన్‌గిడి క్లీన్ బౌల్ చేయగా.. ఆయుష్ బదోని(0), అబ్దుల్ సమద్(36), మహమ్మద్ షమీ(1)లను నటరాజన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎన్‌గిడి, నటరాజన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ తీసి కీలక భూమిక ఫోషించాడు.