
PSL 2026: క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను పాకిస్థాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ మరోసారి చాటుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో భాగంగా తదుపరి మ్యాచ్‌ల కోసం అతను సిద్ధమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కుండపోత కురుస్తున్న వర్షంలో కూడా సైమ్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెటిజన్ల విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
ఈ వీడియోలో సైమ్ అయూబ్ వర్షంలోనూ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా, అతను లెగ్‌సైడ్ వైపు బంతిని ఎత్తి కొట్టినప్పుడు లబుషేన్ “షాట్ బాయ్” అంటూ ప్రశంసించిన సౌండ్ వినిపిస్తుంది. ఈ వీడియోపై అభిమానులు, క్రికెట్ ప్రియులు అతడు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని ఒక వర్గం మెచ్చుకుంటుండగా.. మరో వర్గం యూజర్లు మాత్రం ఇది చాలా ఓవర్ యాక్షన్.. వర్షంలో ఆడటం మూలంగా జలుబు, జ్వరం వస్తుంది.. దీంతో మ్యాచుకి డుమ్మా కొట్టాలనే ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ పేర్కొంటున్నారు.
మరోవైపు, ఈరోజు (2026, మార్చి 31న) లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగాల్సిన ఇస్లామాబాద్ యునైటెడ్ vs పెషావర్ జల్మీ మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా టాస్ ఆలస్యమైంది. మైదానం మొత్తం నీట మునిగిపోవడంతో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో అటు నిర్వాహకులు, ఇటు అభిమానులు తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు.
Pakistani cricketer Saim Ayub practices in heavy rains ahead of PSL 2026 match. Australian batter Marnus Labuschagne shares Instagram story pic.twitter.com/7gOdDyNboG
— Donjuan (@santryal) March 31, 2026