Reading Time: 2 minutes

ప్రదీప్ రంగనాథన్ – కృతి శెట్టిల ఫ్యూచరిస్టిక్ రోమాన్స్.. ‘LIK’ టీజర్ అదిరిపోయిందిగా!

Caption of Image.

కోలీవుడ్ యుంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. ఈసారి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న తమిళం , తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.–

ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ..

ఏడు నెలల క్రితమే తమిళంలో విడుదలైన టీజర్‌ను, ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిన్నపాటి మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇది కేవలం రొమాంటిక్ కామెడీ మాత్రమే కాదు, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యూచరిస్టిక్ డ్రామా అని అర్థమవుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. 

కథ 2040 నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలంలో ప్రేమలు ఎలా ఉంటాయో దర్శకుడు విఘ్నేష్ శివన్ తనదైన శైలిలో చూపించారు. హీరో ప్రదీప్.. ధీమా (కృతి శెట్టి)ను చూడగానే ప్రేమిస్తాడు. అయితే, 2040లో ట్రెండ్‌గా మారిన ఇన్స్టంట్ ప్రేమలు, అర్థం లేని ‘టెక్స్టేషన్ షిప్స్’ అంటే కృతికి అస్సలు ఇష్టం ఉండదు. ఆమె కోరుకునేది కేవలం ఒక పాతకాలపు స్వచ్ఛమైన, శాశ్వతమైన ప్రేమ. వీరిద్దరి ప్రేమాయణం చుట్టూ తిరిగే కామెడీ, ఎమోషన్ ప్రేక్షకులను నవ్వించడమే కాదు, ఆలోచింపజేసేలా ఉన్నాయి.

ఎస్.జే. సూర్య మార్క్ విలనిజం

ఈ కథలో ప్రధాన ఆకర్షణ ఎస్.జే. సూర్య. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే పవర్‌ఫుల్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ అధినేత ‘సూర్య’గా ఆయన కనిపించనున్నారు. వీరి ప్రేమకు సూర్య ఎందుకు అడ్డుపడతాడు? ఆ కంపెనీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సూర్య నటన ఈ చిత్రానికి ప్రధాన బలం కానుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాలతో..

ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే పాటలు తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్నాయి. యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షా రా, మాళవిక కీలక పాత్రల్లో నటించారు. నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ , ఎల్.కె. విష్ణు కుమార్ సంయుక్తంగా నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ రొమాన్స్‌ను ఇష్టపడే వారికే కాకుండా, యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలో ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.