
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం వేసిన అడుగులు అ ద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ’మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు ప్రయాణించి, తద్వారా 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా పా లన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామన్నారు. మ హిళలు ఆదా చేసుకున్న ఈ రూ.10 వేల కోట్లు వారి కు టుంబ ఆర్థిక అవసరాలకు, పిల్లల చదువులకు ఉపయోగపడతాయని అన్నారు. కేవలం బస్సు ప్రయాణమే కాకుం డా, మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాబోయే మూడేళ్లలో మహిళా సం ఘాలకు రూ. లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందించబోతున్నామన్నారు. మహిళలు సూక్ష్మ, మధ్యతరహా పరి శ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
ఆర్‌టిసిని కాపాడుకుంటూనే సంక్షేమ పథకాల అమలు : మంత్రి పొన్నం
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ‘మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంలో ఆర్‌టిసి డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర మరువలేనిదని కొనియాడారు. రోజుకు 65లక్షల మం ది ప్రయాణికులలో 40 లక్షల మంది మహిళలే ఉండటం గొప్ప విషయమని అన్నారు. ఆర్‌టిసిని కాపాడుకుంటూనే మహిళలకు ఈ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆర్‌టిసికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోందని, కొత్త బస్సులు, కొత్త రూట్ల ఏర్పాటుతో సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క
ఉచిత ప్రయాణాన్ని విమర్శించే వారికి మహిళలు తమ తిరుగుబాటుతో సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క పిలుపు నిచ్చారు. ‘సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మహిళలను ఆర్‌టిసి బస్సులకు యజమానులను చేశామని, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని పేర్కొన్నారు. అనంతర మహిళలు పొదుపు చేసుకున్న రూ. 10వేల కోట్ల మెగా చెక్కును మంత్రులు ఆర్‌టిసి ఎండి వై. నాగిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో వైరా ఎంఎల్‌ఎ మాలోతు రాందాస్, మాజీ మేయర్ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి అనిత రామచంద్రన్, సెర్ఫ్ సీఈఓ దివ్య, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్‌టిసి ఈడీలు సిహెచ్. వెం కన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.