Reading Time: 2 minutes

Jadeja vs Dhoni: ధోనీ నా ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయనకు నాకు మాటలు లేవు

Caption of Image.

Jadeja vs Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త, పాత ప్లేయర్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రీయూనియన్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో జట్టులోని దాదాపు అందరూ స్టార్ ఆటగాళ్లు కనిపించగా, జడేజా, ధోనీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం కెమెరాలలో రికార్డు అయింది. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందా అనే ప్రచారం మొదలయింది. ప్రస్తుతం నెట్టింట ఈ గొడవ తెగ ట్రెండింగ్ అవుతుంది. ఈక్రమంలో ఈ వివాదంపై రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. అది కేవలం టెక్నికల్ ఎర్రర్ తప్ప మనస్పర్థలు లేవని స్పష్టం చేయడంతో క్రికెట్ అభిమానులు ఊపరి పీల్చుకున్నారు.

జడేజా మాట్లాడుతూ.. నేను రీయూనియన్‌కు వెళ్లే ముందే ‘మహీ భాయ్’కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో అడుగుదామని అనుకున్నా.. కానీ ఆయన ఫోన్ స్విచాఫ్‌లో ఉండటంతో.. వేడుక జరిగే ప్రదేశంలో కూడా చాలా రద్దీగా ఉండటంతో మేమిద్దరం మాట్లాడుకునే ఛాన్స్ రాలేదన్నారు. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేవని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. ధోనీకి ఫోన్ చేయడం కంటే అతడ్ని నేరుగా కలవడమే ఈజీ, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫోన్ వాడుతారో ఎవరికీ తెలియదని రవీంద్ర జడేజా ఫన్నీ కామెంట్స్ చేశాడు. 

2022 ఐపీఎల్ సమయంలో కెప్టెన్సీ మార్పుతో జడేజా, ధోనీ మధ్య గొడవలు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ 2023 ఫైనల్‌లో జడేజా ఆఖరి బంతికి ఫోర్ కొట్టి సీఎస్కేని విజేతగా నిలిపిన తర్వాత ధోనీ అతడిని ఎత్తుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయవద్దని జడేజా ఫ్యాన్స్ ని కోరాడు. ధోనీ తనకు ఎప్పుడూ గురువు, మార్గదర్శి.. అతనిపై ఉన్న గౌరవాన్ని ఎప్పటికీ తగ్గించనని జడ్డూ తేల్చి చెప్పారు. ఈ రీయూనియన్ వివాదంపై జడేజా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

 

 

©️ VIL Media Pvt Ltd.