Reading Time: < 1 minute

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. కొండను ఢీ కొట్టిన విమానం.. 29 మంది మృతి

Caption of Image.

క్రిమియా: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. క్రిమియాలో రష్యన్ ఏఎన్-26 సైనిక రవాణా విమానం కొండచరియను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. నల్ల సముద్రంలోని ద్వీపకల్పమైన క్రిమియాలో ఈ విమాన ప్రమాదం జరిగింది.

ఈ ద్వీపకల్పాన్ని 2014లో రష్యా ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది. చనిపోయిన 29 మందిలో 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మాస్కో కాలమానం ప్రకారం.. మార్చి 31న సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళుతున్న ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయని.. సాంకేతిక సమస్యల కారణం గానే ఈ ప్రమాదం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.