Reading Time: 2 minutes
అకౌంట్‌లో రూ.44.. చేతిలో రూ. 40.. ప్రజా సమస్యలే పెట్టుబడిగా ఎన్నికల బరిలోకి 26 ఏళ్ల యువతి!

కోట్లు రూపాయలు ఖర్చు చేసే సత్తా ఉంటేనే రాజకీయాల్లోకి దిగాలనే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో కేవలం రూ.84 ఆస్తితో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అఫిడవిట్ దాఖలు చేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన కేరళకు చెందిన 26 ఏళ్ల ఆష్నా తంపి అనే యువతి. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీకి చెందిన 26 ఏళ్ల ఆష్నా తంపి ఎట్టుమానూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంది. తాజాగా ఆమె నామినేషన్ కూడా దాఖలు చేసింది. అయితే తన ఎన్నికల అఫిడవిట్‌లో తన దగ్గర కేవలం రూ. 84 ఆస్తులు మాత్రమే ఉన్నాయని.. వాటిలో తన దగ్గర రూ. 40 నగదు, బ్యాంకు ఖాతాలో రూ. 44 ఉన్నాయిని పేర్కొంది. ఆమె పేరుపై ఎటువంటి ఇల్లు, స్థలం, వాహనాలు కాని లేవని అఫిడవిట్‌లో రాసుకొచ్చింది.

కోట్లాది రూపాయల ఆస్తులు ప్రకటించే అభ్యర్థుల మధ్య, ఆమె వెల్లడించిన ఈ నిరాడంబరమైన ఆస్తి వివరాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. లిటరేచర్‌లో డిగ్రీ, జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసిన థంపి ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, విద్యాపరంగా, సామాజికంగా బలమైన అవహనను కలిగి ఉంది. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన థంపి ఇప్పటి వరకు సమాన్యుల కోసం అనేక పోరాటాలు చేసింది. ఒకానొక సందర్భంలో ఆశా వర్కర్ల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె తన తల వెంట్రుకలను కట్‌చేసుకొని నిరసన తెలిపింది.

ప్రజల మద్దతుతో ప్రచారం

అయితే అందిరిలా కాకుండా ఎన్నికల ప్రచారంలోనూ థంపి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. భారీ ర్యాలీలకు భిన్నంగా, ప్రజల నుంచి వచ్చే విరాళాలతో ఆమె తన ప్రచారాన్ని సాగిస్తోంది. స్థానికులు, పార్టీ కార్యకర్తలు రూ. 10 నుండి రూ. 50 వరకు ఇస్తున్న చిన్నపాటి విరాళాలతోనే పోస్టర్లు, పాంప్లెట్లను ముద్రిస్తూ తన గెలిస్తే ఏం చేయబోతున్నాననో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. స్వయంగా తానే ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటోంది.

ఎన్నికల అజెండా

అట్టడుగు స్థాయి సమస్యలే లక్ష్యంగా దంఫి తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యం కోటయం మెడికల్ కాలేజీలో వైద్యుల కొరత, వరి రైతులకు ఎదురవుతున్న సవాళ్లు, స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యలు సాల్వ్ చేసే దిశగా ఆమె తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమని అష్నా థంపి విశ్వసిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.