Reading Time: 2 minutes
Amil Nadu Elections 2026 5 Key Battles Stalin Eps And Vijays Electoral Debut Explained

Tamil Nadu Elections: తమిళనాడు అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. గత కొన్ని దశాబ్ధాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పోరు నెలకొనగా, ఈ సారి మాత్రం విజయ్ రూపంలో టీవీకే బరిలో నిలించింది. ఇప్పటికే కూటముల మధ్య ఎన్నికల పొత్తులు, సీట్ల పంపణీ ఖరారైంది. ముఖ్యంగా, సీఎంగా అభ్యర్థులుగా ఉన్న ఎంకే స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), విజయ్ కీలక స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

కొలత్తూర్ నుంచి స్టాలిన్:

డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ చెన్నై లోని కొలత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. చేపలు, కూరగాయల మార్కెట్‌లకు కేంద్రంగా ఉన్న చెన్నై వాయువ్య ప్రాంతంలోని ఈ అసెంబ్లీ డీఎంకేకు కంచుకోటగా ఉంది. 2011లో స్టాలిన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద పేర్లు లేకపోవడంతో స్టాలిన్ గెలుపు దాదాపు ఖాయమని నమ్ముతున్నారు.

ఎడప్పాడి నుంచి ఈపీఎస్:

అన్నాడీఎంకే చీఫ్, ప్రతిపక్ష నేత పళనిస్వామి సొంత నియోజవర్గమైన ఎడప్పాడి నుంచే పోటీ చేస్తున్నారు. 1989 నుంచి ఈ అసెంబ్లీ నుంచి పలుమార్లు ఆయన గెలుపొందారు. ఎడప్పాడిగా ఆయనకున్న గుర్తింపు ద్వారా స్థానికంగా నియోజకవర్గంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి సీ.కాశీ పోటీ చేస్తున్నారు.

పెరంబూర్ నుంచి విజయ్:

నటుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన తలపతి విజయ్ ఈ సారి ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. చెన్నైలో ఉత్తర ప్రాంతమైన పెరంబూర్‌ చారిత్రాత్మకంగా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. కార్మిక వర్గం ఈ నియోజకవర్గంలో అధికంగా ఉంటుంది.

త్రిచి తూర్పు నుంచి కూడా విజయ్ పోటీ:

త్రిచి తూర్పు అసెంబ్లీ నుంచి కూడా విజయ్ పోటీ చేస్తున్నారు. డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపును ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ పోటీ చేస్తున్నారు. 2021లో ఈయన ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ స్థానంలో మైనారిటీ ఓట్లు కీలకంగా మారుతాయి.

కారైకుడి నుంచి సీమాన్ పోటీ:

కాంగ్రెస్ కంచుకోట కారైకుడి నుంచి ఎన్‌టీకే కోఆర్డినేటర్ సీమాన్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని హై ప్రొఫైట్ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. సీమాన్ తన ప్రాంతీయ మూలాలపై ఆధారపడుతుండగా, కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్‌ను నమ్ముకుంది. ఈ నియోజకవర్గంలో ముక్కులథోర్, దేవేంద్రకుల వెల్లాలర్లు, ముత్తరైయర్, చెట్టియార్లు అనే కీలక వర్గాలు గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి.