
సిడ్నీ: స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సిఎ) షాకిచ్చింది. 2026-27 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను బుధవారం ప్రకటించింది. అంతర్జాతీయ వైట్-బాల్ క్రికెట్‌లో అంతగా రాణించని గ్లెన్ మాక్స్‌వెల్‌కు 21మందితో కూడిన ఈ జాబితాలో చోటు కల్పించలేదు. మ్యాక్స్‌వెల్, జూన్ 2025లో వన్డేల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి టెస్టులు ఆడటంలేదు.
ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. రాబోయే సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపుతో మాక్స్‌వెల్ టీ20ఐ కెరీర్‌పై కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే 12 నెలల్లో ఆస్ట్రేలియా తదుపరి కాంట్రాక్ట్ కాలంలో బంగ్లాదేశ్ (స్వదేశంలో), దక్షిణాఫ్రికా (విదేశంలో), న్యూజిలాండ్ (స్వదేశంలో), భారత్ (విదేశంలో) లతో టెస్ట్ సిరీస్‌లు, ఇంగ్లాండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్ట్, 2027 యాషెస్ ఆడనుంది.