
Pakistan Violates Ceasefire: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని కనాచక్ సెక్టార్‌లో సాధారణ నిఘా నిర్వహిస్తున్న భారత రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ (RPA/Drone) లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులు జరిపాయి. అయితే, భారత డ్రోన్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అది సురక్షితంగా వెనక్కి వచ్చింది.
READ ALSO: Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్
పలు నివేదికల ప్రకారం.. నిన్న రాత్రి కనాచక్ సెక్టార్‌లోని భారత భూభాగంలో మన డ్రోన్ సాధారణ నిఘా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సరిహద్దుకు అవతలి వైపు ఉన్న పాకిస్థానీ పోస్టుల నుంచి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరగగా.. అందులో నాలుగు రౌండ్లు ఖేరీలోని పాకిస్థానీ పోస్ట్ నుంచి, ఒక రౌండ్ అస్లాం పోస్ట్ నుంచి జరిగాయి. భారత డ్రోన్ తన సొంత భూభాగంలోనే ఉన్నప్పటికీ, పాక్ దళాలు కావాలనే దీనిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న ఉద్రిక్తతలు..
గత ఏడాది పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో పాక్ జరిపిన ఈ కాల్పులు అత్యంత బాధ్యతారహితమైనవిగా భారత రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ చేస్తున్న ఇలాంటి చిన్నపాటి రెచ్చగొట్టే చర్యలు కూడా పెద్ద ఎత్తున సరిహద్దు ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల కాలంలో నియంత్రణ రేఖ (LoC) సమీపంలో పాకిస్థానీ డ్రోన్లు, బెలూన్లు తరచుగా కనిపిస్తున్నాయి. భారత సరిహద్దుల్లోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేయడానికి పాక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే నిర్థారణ అయ్యింది. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు కొనసాగిస్తూనే ఉంది. పాకిస్థాన్ వరుస కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే సరిహద్దు వెంబడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పాక్ జరిపిన కాల్పులకు భారత దళాలు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని సరిహద్దు దళాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
READ ALSO: Shreyas Iyer : పాపం పంజాబ్ కెప్టెన్ కొంపముంచిన ఆ తప్పు .. మ్యాచ్ గెలిచిన రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!