Reading Time: < 1 minute

ఎంపీ పదవి నుంచి డిస్మిస్ చేయాలని పిటిషన్.. హైకోర్టులో కేంద్ర మంత్రి సురేష్ గోపికి ఎదురు దెబ్బ!

Caption of Image.

మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపికి హైకోరులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పిటిషన్ ను కొట్టివేయాల్సిందిగా చేసిన అభ్యర్థనను బుధవారం (ఏప్రిల్ 01) కొట్టివేసింది కేరళ హైకోర్టు. సురేష్ గోపి ప్లీ ని తిరస్కరించిన జస్టిస్ కాసర్ ఎడప్పగాత్.. ఈ విషయంలో ట్రయల్ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి ఆర్డర్ రావాల్సి ఉంది.

కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, టూరిజం మంత్రి సురేష్ గోపిపై ఈ ఎన్నికల పిటిషన్ ను  ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకుడు, త్రిస్సూర్ స్థానికుడు ఏఎస్ బినోయ్ వేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. 2024లో త్రిస్సూర్ లోక్ సభ నుంచి పోటీ చేసిన గోపి.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి గెలుపు కోసం అడ్డదారులు తొక్కినట్లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మతాన్ని వాడుకున్నట్లు ఆరోపించారు. ఆయన ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాల్సిందిగా పిటిషన్ లో కారారు. 

కేరళలో దాదాపు 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో.. బీజేపీ జెండా ఎగరవేసి సురేష్ గోపి చరిత్ర సృష్టించారు.  త్రిస్సూర్ లోక్ సభ నుంచి 74 వేల 686 ఓట్ల మెజారిటీతో గెలిచి కేరళలో కాషాయ రాజకీయాలకు బీజం వేశారని ఆయనకు కేంద్ర కేబినెట్ లో స్థానం ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. 

©️ VIL Media Pvt Ltd.