
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య చివరిగా అఖండ 2 సినిమాతో హిట్ కొట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. హిస్టారికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..
ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి
ఇదిలా ఉంటే బాలకృష్ణ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నానితో అంటే సుందరానికి, అలాగే సరిపోదు శనివారం అనే సినిమాలు చేసి మెప్పించాడు. అలాగే ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి రెడ్డి అవుతున్నారు. అయితే ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య , వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కురుక్షేత్రం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
ఈ సినిమాను మహాభారతం నేపథ్యంలో ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మరికొందరు యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండే ఛాన్స్ ఉందని, అందుకే ఆ టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్. బాలయ్యతో మైథాలాజికల్ సినిమా చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అనౌన్స్ చేయనున్నారు.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.