Reading Time: 2 minutes

IPL 2026: లక్నోకు బిగ్ షాక్.. 75 పరుగులకే 5 వికెట్లు లాస్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధమైంది. ల‌క్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కేవలం 49 పరుగులకే ఆ టీమ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు. వరుస వికెట్లు కోల్పోవడంతో LSG తీవ్ర కష్టాల్లో పడింది.

ఇక తొలుత బ్యాటింగ్ కి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మంచి ఆరంభం లభించలేదు. నిలకడైనా బ్యాటింగ్ తో పరుగులు చేసేందుకు ఒకవైపు పంత్ తీవ్రంగా శ్రమించినప్పటికీ.. మిచెల్ మార్ష్ మాత్రం ఎటాకింగ్ షాట్స్ ఆడటంతో స్కోర్ బోర్డు కాస్త ముందుకు కదిలింది. కానీ ముకేష్ కుమార్ బౌలింగ్ లో (2.6) మార్ష్ కొట్టిన బంతి.. బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న వికెట్లని తాకింది.. క్రీజు బయట ఉన్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తొలి బ్రేక్ త్రూ లభించింది. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కూడా ఎక్కువ సేపు మైదానంలో నిలవలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో మార్క్రమ్ క్లిన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 48 పరుగుల వద్ద రెండో వికెట్ గా పెవిలియన్ కి చేరుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ఆయూష్ బదోనీ డకౌట్ అయ్యాడు. టి.  నటరాజన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలి పెట్టి వెళ్లిపోయాడు. దీంతో 49 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోగా.. ఇక 65 పరుగుల వద్ద లుండి ఎంగిడి బౌలింగ్ లో నికోలస్ పూరన్ (8) క్లిన్ బౌల్డ్ అయిన కాసేపటికే.. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35) ఒంటరి పోరాటం చేసి కుల్ దీప్ యాదవ్ బౌలింగ్ లో స్టబ్స్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 75 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. 

©️ VIL Media Pvt Ltd.