వంట గ్యాస్ సమస్య పరిష్కారానికి వినూత్న ఆలోచన. పొగ లేకుండా పొయ్యిలపై వందల మందికి వంట. ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా యుద్దం నేపధ్యంలో వంట గ్యాస్ దొరకదు అనే భయాందోళనలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వినూత్నంగా పరిష్కరించవచ్చని అంటున్నారు తులసీ రాంబాబు. ప్రతీ రోజు రెండు వందల మందికి పైగా వంట చెరకును ఉపయోగించి వంటలు చేస్తున్నారు. వంట పొయ్యిల దగ్గర గాలి వచ్చేట్టు మోటార్ ( బ్రోయర్ ) ఏర్పాటు చేసారు.
మోటార్ నుండి వచ్చిన గాలి పోయ్యలోకి వెళ్ళి మంట ప్రజ్వలనంగా వస్తుంది. గ్యాస్ మంట కంటే ఎక్కవ మంట వస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంకు చెందిన తులసి రాంబాబు మండలం లోని పద్దెనిమిది గ్రామాలలోని వృద్దులకు, వంట చేసుకోలేని వారికి, వికలాంగులకు ఉచితంగా రెండు పూటలు భోజనం అందిస్తారు. ప్రతీ రోజు ఉదయాన్నే రెండు వందల మందికి సరిపడా అన్నం, కూర, పప్పు, రసం వండించి క్యారేజీ లలో వాళ్ళు ఇళ్లకు పంపిస్తారు.
వారంలో రెండు రోజులు బుధవారం, ఆదివారం నాన్ వెజ్ కర్రీ లో క్యారేజీ లను పంపిస్తారు. అలానే ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పీజీఆర్ యస్ ) కు వచ్చే ప్రజలకు ఉచితంగా భోజనం పంపిస్తారు. ఈ భోజనాలు అన్ని కట్టెల పొయ్యిలపై వండుతామని రాంబాబు అంటున్నారు. కట్టెల పొయ్యి పై వంటలు వండటం వల్ల చాలా రుచిగా, శుచిగా ఉంటాయని అంటున్నారు.
ఎప్పటికైనా గ్యాస్ సంక్షోభం వచ్చి గ్యాస్ దొరికని పరిస్థితి ఉంటుందనే ముందు ఆలోచనతో వంట చెరకుతో పొయ్యలపై వంటలు చేస్తున్నామని రాంబాబు అంటున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఇలానే గ్యాస్ అవసరం లేకుండా వంటలు చేసి భోజనాలు అందిస్తున్నామని అంటున్నారు. తాము వినూత్నంగా తయారు చేసిన ఇటువంటి పొయ్యలను సింపుల్ గా తయారు చేయించుకుని అపార్ట్మెంట్ లలో కూడా వాడుకోవచ్చు అని అంటున్నారు.
వీరవాసరం మండలంలో తులసీ రాంబాబు క్యారేజీల ద్వారా నిరుపేదలకు, వంట చేసుకోలేని వారికి, వికలాంగులకు భోజనాలు అందిస్తున్నారని, ఆయన కట్టెల పొయ్యిపై వండుతారని స్థానికుడు బోస్ అంటున్నారు. కట్టెల పొయ్యిపై వండిన వంటలు చాలా రుచికరంగా ఉంటున్నాయని అంటున్నారు. గ్యాస్ గురించి ఇబ్బందులు పడకుండా తులసీ రాంబాబును ఆదర్శంగా తీసుకుని కట్టేల పొయ్యిను ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.




