
అమెరికాకు మరోదేశం షాక్ ఇచ్చింది. స్పెయిన్ బాటలోనే ఇటలీ నడిచింది. ఇరాన్‌పై దాడులకు దిగుతున్న అగ్రదేశం విమానాలకు తమ గగనతలం మీదుగా అనుమతి లేదని తాజాగా ఇటలీ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడయ్యాయి. బాంబర్ విమానాలు నిలపడం, అక్కడి నుంచి ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి సిసిలీలోని వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుంటామని అమెరికా ఇటీవల ఇటలీకి చేసిన విజ్ఞప్తిని ఆ దేశం ప్రభుత్వం తిరస్కరించిందని మీడియా తెలిపింది. ఇప్పటికే మిత్రదేశాలు ఇరాన్‌పై యుద్ధంలో కలిసి రావడం లేదని ఆరోపణలు చేస్తున్న ట్రంప్‌కు తాజాగా ఇటలీ తీసుకున్న నిర్ణయం ఎదురుదెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులను ఐరోపా యూనియన్ దేశాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటలీ తాజా నిర్ణయం వెలువడడం విశేషం.