
దాదాపుగా 6 లక్షల బ్యారెల్స్ ఇరాన్ ముడిచమురు నౌక భారత్‌కు చేరుకోనుంది. ఏడు సంవత్సరాల వ్యవధిలో ఇరాన్ క్రూడాయిల్ భారత్‌కు చేరడం ఇదే మొదటిసారి. గల్ఫ్ యుద్ధం క్రమంలో భారత్‌కు ఇరాన్ నుంచి ఈ చమురు అందుతోంది. గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్టుకు ఈ నెల 4వ తేదీన ఈ క్రూడాయిల్ నౌక చేరుతుందని అధికారులు తెలిపారు. గతంలో అమెరికా ఆంక్షలతో ఇరాన్ నుంచి భారతదేశం చమురు నిలిపివేతకు దిగింది.
ప్రస్తుత చమురు సంక్షోభ దశలొ అమెరికా ఆంక్షలు సడలించారు. దీనితో పాటు భారత్‌కు క్రూడాయిల్ చేరవేతకు ఇరాన్ ఆసక్తి చూపింది. రెండు మూడు రోజుల్లో చమురు ఇక్కడికి చేరడంతో దేశంలో ఇంధన లోటు భర్తీకి వీలేర్పడుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు ఇరాన్ నుంచి భారత్‌కు 2019 మేలో క్రూడాయిల్ అందింది. తరువాత ఇప్పుడు ఈ చమురు రానుంది.