Reading Time: < 1 minute

IPL 2026: నెమ్మదిగా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్.. 10 ఓవర్లలో స్కోర్ ఎంతంటే !

Caption of Image.

 
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ లోని ముల్లాన్‌పూర్ లో గల అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక పోరులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్‌కి వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ స్లోగా పరుగులు చేస్తుంది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో రన్స్ చేయడం కష్టతరంగా మారింది. 

 గుజరాత్ టైటాన్స్ మొదటి 3 ఓవర్లలో దూకుడుగా ఆడిన తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మార్కో జాన్సెన్‌ను బౌలింగ్‌ చేసేందుకు తీసుకు వచ్చాడు. వచ్చి రావడంతోనే సాయి సుదర్శన్ ( 11 బంతుల్లో 2 ఫోర్లతో కేవలం 13 పరుగులు) కి వేసిన ఓ అద్భుతమైన బాల్ ని ఆడిన సుదర్శన్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో పంజాబ్ కింగ్స్‌కు తొలి బ్రేక్‌త్రూ లభించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్– గిల్ కలిసి స్కోర్ బోర్డుని ముందుకి నడిపించారు. 

శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ ఇద్దరూ కూడా వేగంగా పరుగులు చేసే క్రమంలో యజ్వేంద్ర చాహల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ( 27 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు )ను అవుట్ చేశాడు. చాహల్ వేసిన బంతిని బలంగా కొట్టబోయి కూపర్ చేతికి చిక్కాడు. దీంతో గుజరాత్ 76 పరుగుల వద్ద రెండో వికెట్ ని కోల్పోయింది.  అనంతరం క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి గుజరాత్ స్కోర్ బోర్డుని బట్లర్ పరుగులు పెట్టించాడు. దీంతో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. 

 
 

 

©️ VIL Media Pvt Ltd.