Reading Time: 2 minutes

New Zealand: బంగ్లాదేశ్ పర్యటనకు కివీస్.. వన్డే, టీ20 జట్లని ప్రకటించిన న్యూజిలాండ్ బోర్డు

Caption of Image.

New Zealand: బంగ్లాదేశ్ పర్యటనకు జట్టుని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్ త్రయం మ్యాచ్ ఫిషర్, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్ టిక్నర్లకు స్థానం లభించింది. కాగా భారత్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్-2026 ఫైనల్లో ఓడిన బ్లాక్ క్యాప్స్.. రన్నరప్ గా నిలిచింది. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో సొంత గడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన కివీస్.. ఐదు మ్యాచులో ఈ సిరీస్ లో ప్రొటిస్ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్ పై 3–2 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్– బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడబోతుంది. ఏప్రిల్ 17న తొలి వన్డే మ్యాచ్ తో సిరీస్ మొదలు కానుండగా.. మే 2వ తేదీన 3వ టీ20తో ఈ టూర్ ముగుస్తుంది. 

బంగ్లాదేశ్ తో టీ20 జట్టుకి న్యూజిలాండ్ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్ టామ్ లాథమ్ కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. కాగా సాంట్నర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో.. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ లలో బిజీగా ఉండటంతో.. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే కివీస్ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న ఫిషర్, ఓరూర్కీ, టిక్నర్ తిరిగి జట్టుతో చేరడంతో హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. ఆల్రౌండర్ డీన్ ఫాక్రాఫ్ట్ చాలా కాలం అనంతరం తిరిగి జాతీయ జట్టులో చేరాడు. 

న్యూజిలాండ్ వన్డే జట్టు: 
టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్ క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

న్యూజిలాండ్ టీ20 జట్టు: 
టామ్ లాథమ్ (కెప్టెన్), కెటెనె క్లార్క్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్ సన్, డేన్ క్లీవర్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్రాఫ్ట్, బెవాన్ జేకబ్స్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.

©️ VIL Media Pvt Ltd.