
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘జీ స్టూడియోతో, దివ్య గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ అని ఓ సిరీస్ చేశాం. ఆ టైంలో మానస గారి డైలాగ్స్ మొదటగా విన్నాను. ఆ తరువాత మానస గారిని చూశాను. ఆమె తక్కువ మాట్లాడుతుంది. కానీ చాలా ఆలోచిస్తుంటుంది. 24 గంటలు సినిమా గురించి, కథ గురించే ఆలోచిస్తుంటుంది. మానస ఇంకా ఇంకా చాలా ఎత్తుకు వెళ్తుంది. మానస గారు, మహేష్ గారు, యదు వంశీ గారి వంటి వారిని ఇంట్రడ్యూస్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ చేస్తున్నప్పుడు 11, 15 మంది కొత్త వాళ్లతో చేయడం ఎందుకు అన్నారు?.. ‘రాకాస’ టైంలో ఇలాంటివి ఎందుకు ‘కమిటీ కుర్రోళ్లు’ లాంటి సినిమాలు చేసుకోవచ్చు కదా అని అన్నారు.. ‘బరి’ చేస్తుంటే.. ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎందుకు? అని అంటున్నారు.. ఇలా అనే వాళ్లు అంటూనే ఉంటారు.. నాకు నచ్చింది నేను చేస్తూనే ఉంటాను.
‘నేను నా ప్రతీ సినిమాతో కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉంటాను. నాకు కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ సమానమే. నా మీద నమ్మకం పెట్టుకుని, నాకు ఫ్రీడం ఇచ్చిన నా తల్లిదండ్రులకు థాంక్స్. రమేష్ గారు మొదటి నుంచి మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అనుదీప్ గారికి అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ ఉంది. రాజు గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. విజయ్ మాస్టర్ గారిని సెట్లో చూస్తే మా నాన్న గారిని చూసినట్టే అనిపిస్తుంది. అన్వర్ అలీ గారు కేవలం ఎడిటర్‌గా కాకుండా అన్ని బాధ్యతల్ని చూసుకుంటారు. నాన్న గారి వల్ల నాకెంతో మంది పరిచయమయ్యారు. అందులో గెటప్ శ్రీను ఒకరు. ఆయన నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నయన్‌లో ఓ ప్రత్యేకత ఉంది. ఆమె చాలా మంచి వ్యక్తి. సంగీత్ షైనింగ్ స్టార్. ‘రాకాస’ చిత్ర విజయంలో సంగీత్‌కి సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో వంద శాతం కష్టపడి ఓ మంచి సినిమాని చేశాం. మా పింక్ ఎలిఫెంట్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’ ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.