Reading Time: 2 minutes

PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

Caption of Image.

PSL 2026: పాకిస్తాన్  లో జరుగుతున్న టీ20 లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్‌(Ball Tampering)కు పాల్పడిన పాక్ ఆటగాడు ఫఖర్ జమాన్‌పై నిషేధం విధించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (PSL 2026) రూల్స్ ని ఉల్లంఘించిన అతడు రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఈ రోజు (2026, మార్చి 31న) ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బంతి ఆకృతిని మార్చేందుకు ట్రై చేసినందుకు ఫఖర్ ఆర్టికల్ 2.14ను అతిక్రమించాడు. దీంతో అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది పాక్ బోర్డు పేర్కొనింది.

అసలు ఏం జరిగిందంటే: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్‌ టీమ్ తరపున ఫఖర్ జమాన్ ఆడుతున్నాడు. మార్చి 29వ తేదీన కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో అతడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన అంపైర్లు లాహోర్ జట్టుకు 5 రన్స్ జరిమానా విధించడంతో పాటు కొత్త బాల్ ని తీసుకున్నారు. ఫఖర్ జమాన్ తీరును తప్పుబట్టిన అంపైర్లు షాహిద్ సైకత్, ఫైజల్ ఖాన్ అఫ్రీది.. టీవీ అంపైర్ అసిఫ్‌ యాకూబ్, ఫోర్త్ అంపైర్ తారీక్ రషీద్‌లు క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేసేశారు. 

ఇక ఫఖర్ జమాన్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిపై క్రమశిక్షణ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఈ సందర్భంగా ఫఖర్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఎవిడెన్స్ ని అంపైర్లు చూపించడంతో.. రెండు మ్యాచ్‌ల బ్యాన్ విధించారు. దాంతో ఏప్రిల్ 3వ తేదీన ముల్తాన్ సుల్తాన్స్, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్‌లకు ఈ పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ దూరం కాబోతున్నాడు.  

 

 

©️ VIL Media Pvt Ltd.