బంగారం ధరలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇప్పటికే దాదాపు లక్ష ఎనభై వేలకు ఎగబాకిన బంగారం ధరలు యుద్ధం నేపథ్యంలో దాదాపు 30 వేలకు పైగా దిగి వచ్చింది. దీంతో చాలా మంది బంగారం ధరలు లక్షకు చేరువ అవుతాయని అందరూ ఊహించారు. కానీ డాలర్ పుంజుకోవడంతో మళ్లీ గోల్డ్ రేట్స్ పెరగడం ప్రారంభమైంది. కాగా, ఏప్రిల్1,2026 బుధ వారం రోజున బంగారం ధరల స్వల్పంగా పెరిగింది.
గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ. 1,49,510 ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజు రూ.10 పెరగడంతో నేడు బంగారం ధర రూ. 1,49,520గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ.1,37,050గా ఉండగా, నేడు ఏప్రిల్ 1న రూ. 1,37,060గా ఉంది.
విజయవాడ మార్కెట్లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ. 1,49,510 ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజు రూ.10 పెరగడంతో నేడు బంగారం ధర రూ. 1,49,520గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ.1,37,050గా ఉండగా, నేడు ఏప్రిల్ 1న రూ. 1,37,060గా ఉంది.
ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31, మంగళ వారం రోజున 1,49,130 గా ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజూ. రూ.10 తగ్గడంతో 1,49,120గా ఉంది.
అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31, మంగళ వారం రోజున 1,36,700 గా ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజూ. రూ.10 తగ్గడంతో 1,36,690గా ఉంది.




