Reading Time: 2 minutes
Tollywood : స్టార్ హీరోల ఫేవరేట్ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాకుమారి.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఆమెతో సినిమా చేయడానికి స్టార్స్ సైతం ఆసక్తి చూపించేవారు. పెళ్లి తర్వాత చిత్రాలకు దూరమైన ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన చిన్నప్పటి ఫోటోస్ పంచుకుంది. గుండుతో ఉన్న క్యూట్ పిక్స్ చూసి తెగ సంబరపడిపోతూ పోస్ట్ చేసింది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ సమీరా రెడ్డి. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు సౌత్ క్వీన్.

ఎక్కువ మంది చదివినవి : Music Director : పూరి జగన్నాథ్ పరిచయం.. నా లైఫ్‏కు టర్నింగ్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్..

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ చిత్రాల్లో కనిపించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి జోడిగా జై చిరంజీవ సినిమాలో మెప్పించింది. అలాగే తమిళంలో సూర్య సరసన నటించి ప్రశంసలు అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2014లో ఎంటర్ ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమెకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు.

ఎక్కువ మంది చదివినవి : Throwback Movie : 1996లో బాక్సాఫీస్‍ను షేక్ చేసిన సినిమా.. కోటి రూపాయాలతో తీస్తే 11 కోట్ల కలెక్షన్స్..

అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా తన చిన్ననాటి ఫోటోస్ పంచుకుంది. దాదాపు 13 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు చిమ్ని అనే హారర్ మూవీతో రీఎంట్రీ ఇస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Babu Mohan : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయన లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. బాబు మోహన్ కామెంట్స్..

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.9 కోట్లతో తీస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను షేక్ చేసిన తమిళ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..