Reading Time: 2 minutes
Aditi Myakal: ఆ సినిమాలో నటిస్తే రూ.500ఇచ్చారు.. డబ్బులతో ఏం చేశానంటే

నటి అదితి మ్యాకల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో సహాయక పాత్రలతో మెప్పించింది అదితి మ్యాకల్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం, నటనా ప్రస్థానం, తెలుగు చిత్ర పరిశ్రమలో తన అనుభవాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.  చిన్నతనం నుంచే నటి కావాలనే బలమైన కోరిక అదితిలో ఉంది. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు తన డైరీలో కొన్ని లక్ష్యాలను రాసుకున్నానని  తెలిపింది. నాని, శర్వానంద్, వరుణ్ సందేశ్ లాంటి హీరోలతో పనిచేయాలని రాసుకుందట. ఈ లక్ష్యాలలో కొన్ని ఇప్పటికే నెరవేరాయని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నానితో జెంటిల్‌మన్ చిత్రంలో, శర్వానంద్‌తో మరో చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించగా, ప్రస్తుతం వరుణ్ సందేశ్‌తో ఒక సినిమాలో పనిచేస్తున్నా అని తెలిపింది. అయితే, తన డైరీలో సిద్దార్థ్ పేరు రాయలేదని, అందుకే ఆయనతో నటించే అవకాశం రాలేదేమో అని సరదాగా చెప్పింది అదితి. 30 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనే అనుకున్నా.. కానీ ఇండస్ట్రీకి వచ్చాక పక్కన పెట్టానని, ప్లాన్ చేస్తే  ఇక్కడ పనిచేయవని ఫ్లోలో వెళ్లాలని భావిస్తున్నానని తెలిపారు. నటిగా మారాలనే బలమైన కోరికను ఏడవ తరగతి నుంచే పెంచుకున్నానని అదితి వెల్లడించారు.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

నాలుగో తరగతి వరకు దేవుడిని కేవలం కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే గుడికి వెళ్లేదానినని, ఏడవ తరగతి నుంచి సెల్ఫిష్‌గా మారి హీరోయిన్ కావాలని కోరుకోవడం ప్రారంభించానని చెప్పారు. శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం చిత్రంలో పదవ తరగతిలోనే హీరోయిన్‌గా నటించడం తనకు స్ఫూర్తినిచ్చిందని, అప్పటి నుంచి హీరోయిన్ కావాలనే తన కోరిక బలపడిందని ఆమె వివరించారు. ఆదితి మ్యాకల్ తన మొదటి సంపాదన తొమ్మిదో తరగతిలో యాంకరింగ్ ద్వారా రూ.150 అని వెల్లడించారు. ఈ డబ్బుతో ఏ మాయ చేసావే చిత్రంలో సమంత ధరించిన స్టైల్‌లో ఒక చుడీదార్ కొనుక్కున్నారు. ఆమె మొదటి సినీ పారితోషికం జెంటిల్‌మన్ చిత్రానికి రూ. 500 అని, ఆ డబ్బుతో హెయిర్ కలర్ చేయించుకుని, బెల్లీ పియర్సింగ్ చేయించుకున్నానని తెలిపింది. కాగా కెమెరా ముందు కనిపించిన మొదటి చిత్రం ముద్దపప్పు ఆవకాయ కాగా, సిల్వర్ స్క్రీన్‌పై జెంటిల్‌మన్ తన మొదటి సినిమా అని తెలిపింది.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

ఆ తర్వాత నమో వెంకటేశలో నటించారు. తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా లభిస్తున్నాయని అదితి ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీలీల, ఈషా రెబ్బా, వైష్ణవి చైతన్య వంటి కొద్ది మంది మాత్రమే ప్రధాన పాత్రల్లో రాణిస్తున్నారని, మిగిలిన వారికి సరైన అవకాశాలు రావట్లేదని ఆమె తెలిపింది. తెలుగు నటులను తీసుకుంటే ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించవచ్చని, విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, పెద్ద ఆంట్రాజ్ అవసరం ఉండదని అదితి అభిప్రాయపడ్డారు. తెలుగు అమ్మాయిలకు అందం, నటనా సామర్థ్యం రెండూ ఉన్నాయని, ప్రేక్షకులు తెలుగు నటులకు సులభంగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

 

View this post on Instagram

 

A post shared by Aditi Myakal (@aditi.myakal)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.