Reading Time: < 1 minute

ఫ్రీ ఐపీఎల్ టికెట్ల కోసం లింక్ క్లిక్ చేయమని పోస్ట్ చేసిన బెంగళూరు సిటీ పోలీస్.. తీరా క్లిక్ చేస్తే..

Caption of Image.

ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్లు కూడా అయిపోయాయి. ఐపీఎల్ టికెట్ల కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. డిస్ట్రిక్ట్ యాప్లో ఐపీఎల్ టికెట్లు అందుబాటులో ఉంచిన నిమిషాల వ్యవధిలోనే సేల్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో.. ఐపీఎల్ టికెట్లు ఫ్రీగా ఇస్తామని ఏకంగా బెంగళూరు సిటీ పోలీస్ ‘ఎక్స్’లో పోస్ట్ కనిపిస్తే అభిమానులు ఊరుకుంటారా..? బెంగళూరు సిటీ పోలీస్ ఈ లింక్ క్లిక్ చేస్తే రెండు టికెట్లు ఫ్రీగా ఇస్తామని పోస్ట్ పెడితే అభిమానులు ఆగుతారా..? అస్సలు ఆగరు. ఈ లింక్పై క్లిక్ చేసిన అభిమానులందరినీ బెంగళూరు సిటీ పోలీసులు ఏప్రిల్ 1 సాక్షిగా ఫూల్స్ను చేశారు.

మీపైన ప్రాంక్ చేశామని.. ఇది పూర్తిగా సేఫ్ లింక్ అని.. ఎలాంటి మాల్వేర్ లేదని.. కంగారుపడొద్దని ఈ లింక్ చేసిన అభిమానులకు కనిపించింది. ఫూల్స్ అయిన అభిమానులు వాళ్లలో వాళ్లే నవ్వేసుకుని.. ఫ్రెండ్స్ చేతిలో తప్పించుకున్నా పోలీసులు తమను ఫూల్స్ చేశారని ఈ పోస్ట్ కింద కామెంట్ చేశారు. 

బెంగళూరులో ఏప్రిల్ 5న (ఆదివారం) ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు సేల్ అయిపోయాయి. ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్, కొలీగ్స్ ను ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రాంక్స్ చేస్తూ ఆ రోజును సరదాగా ఆస్వాదిస్తుంటారు. కానీ.. పబ్లిక్ పై ఇలా ప్రాంక్ చేయడం మాత్రం బెంగళూరు పోలీసులకే చెల్లిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.