Reading Time: < 1 minute
Ap Ntr Vaidya Seva Scheme Stopped Aarogyasri Hospitals Protest

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు కొండంత అండగా నిలిచే ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) నేటి నుంచి నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. గత కొంతకాలంగా పేరుకుపోయిన భారీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో పాటు, పాత ప్యాకేజీ ధరలనే కొనసాగించాలన్న మొండి వైఖరిని నిరసిస్తూ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు నెలల కాలంలో చెల్లించాల్సిన బకాయిలు రూ. 2,500 కోట్ల నుండి ఏకంగా రూ. 3,000 కోట్లకు చేరుకున్నాయని, వీటి చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడంతో చిన్న తరహా ఆసుపత్రులు నిర్వహణ భారమై మూతపడే స్థితికి చేరుకున్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

బకాయిల సమస్య ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ (UHC) విధానంపై కూడా ఆసుపత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ప్రామాణికంగా తీసుకుని ఇన్సూరెన్స్ మోడల్‌లో చెల్లింపులు చేస్తామనడాన్ని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తోసిపుచ్చారు. పెరిగిన మందుల ధరలు, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులు , సిబ్బంది జీతాల దృష్ట్యా పదేళ్ల క్రితం నాటి ధరలతో నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్యాకేజీలను సవరించకుండా కొత్త విధానాన్ని అమలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 3,000 కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్యాకేజీ ధరలను పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం , ఆసుపత్రుల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద రోగులకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.