Reading Time: < 1 minute

చత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రమని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సహాయ్ ప్రకటించారు. కేంద్రం విధించిన గడువు మార్చి 31కి అనుగుణంగా చర్యలు చేపట్టామని, తద్వారా లక్షంగా చేరుకున్నామనారు. మంగళవారంనాడు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో విష్ణుదేవ్ మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రత్మక రోజని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ నక్సల్స్‌తో వేదిక పంచుకున్నారని, ఇప్పుడు ఆయన పార్టీ తమపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు.

వామపక్ష తీవ్రవాదంపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు 3కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అభివృద్ధికి తీవ్రవాదం ఇన్నాళ్లూ ఆటకంగా మారిందని అన్నారు. మావోయిస్టలకు గత 40 సంవత్సరాలుగా పెట్టనికోటగా మారిన బస్తర్ ఇప్పుడు పూర్తిగా బయటి ప్రపంచంతో మమేకం కాబోతోందని, తద్వారా పురోభివృద్ధికి బాటలు పడతాయని విష్ణుదేవ్ అభిప్రాయపడ్డారు