Reading Time: < 1 minute

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న గుజరాత్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ..  మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. గత సీజన్‌లో మేము అద్భుతంగా రాణించాం, కానీ ఇప్పుడు ఎలా ఆడాలో అనే దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టడం ముఖ్యం అన్నారు. గత చరిత్ర గురించి ఆలోచించకుండా, మా అత్యుత్తమ క్రికెట్‌ను ఆడాలనుకుంటున్నాం.. మా జట్టులోకి కూపర్ కొన్నోలీ, స్టోయినిస్, బార్ట్లెట్, మార్కో జాన్సన్ వచ్చారని పేర్కొన్నారు. 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఈ వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. గత రెండు రోజులుగా ఇక్కడ అడపాదడపా వర్షం పడుతోంది.. గత సీజన్ మాకు బాగా కలిసి వచ్చింది.. ఈ మ్యాచ్‌తో గ్లెన్ ఫిలిప్స్, ఆశిక్ శర్మ అరంగేట్రం చేస్తున్నారు. జోస్ బట్లర్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం మాకు పెద్ద బలం.. ఈ ఏడాది అతను మా కోసం అద్భుతంగా రాణిస్తాడని నమ్ముతున్నాను అని గిల్ చెప్పుకొచ్చాడు. 

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఎం షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్

©️ VIL Media Pvt Ltd.