Reading Time: 2 minutes

Nayanthara: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి మూవీలో నయనతార.. SVC63 షూటింగ్ డేట్ ఫిక్స్!

Caption of Image.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయింది. ఈ వార్త ఇప్పటికే ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది. అయితే  లేటెస్ట్ గా అంతకు మించిన మరో సెన్సేషనల్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన సౌత్ ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార హీరోయిన్‌గా నటించబోతోంది.

ఖరారైన క్రేజీ కాంబినేషన్!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ 63వ చిత్రం (#SVC63) ద్వారా సల్మాన్ ఖాన్, నయనతార తొలిసారి వెండితెరపై జతకట్టబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ప్రతిభకు, నైపుణ్యానికి నిలువుటద్దమైన క్వీన్ నయనతార మా ప్రాజెక్ట్‌లోకి రావడం మాకు దక్కిన గౌరవం అంటూ వెల్కమ్ చెప్పారు. 2023లో షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు, హిందీలో ఇది రెండో సినిమా .

ఏప్రిల్ నుంచే షూటింగ్ షురూ!

ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియాలో వంశీ పైడిపల్లితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “దిల్, దిమాగ్, జిగర్ సే.. ఈ ఏప్రిల్ నుంచి వస్తున్నాం” అంటూ తనదైన స్టైల్లో క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రం హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ముంబైలోని గోరేగావ్‌లో ఇందుకోసం ఒక భారీ ‘మినీ సిటీ’ సెట్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

దిల్‌రాజు బాలీవుడ్ ప్లాన్

సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు, దిల్‌రాజు బాలీవుడ్‌లో తన పట్టును మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. తాజాగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఒక భారీ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇది వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అనీస్ బాజ్మీ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు.

ALSO READ : భార్య‌తో బ‌ల‌వంత‌పు శృంగారంపై చిన్మయి ట్వీట్..

సల్మాన్ లైనప్.. 

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘మాతృభూమి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇది ఏప్రిల్ 17న విడుదల కానుంది. దీని తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి క్లాస్ అండ్ మాస్ హిట్స్ ఇచ్చిన వంశీ, సల్మాన్ ఖాన్‌ను సరికొత్త యాక్షన్ అవతారంలో చూపించబోతున్నారనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. సౌత్ టేకింగ్, నార్త్ స్టార్ పవర్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ‘సల్మాన్-వంశీ-నయనతార’ మ్యాజిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.