Reading Time: < 1 minute

వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై చాలా కాలమే అయినా.. పరిస్థితులు ప్రశాంతంగా మారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌పై ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని.. ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాకు ధీటుగా జవాబిస్తూ వస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. పాత పాలకుడితో పోలిస్తే ఇరాన్ కొత్త పాలకుడు మోజ్తబా ఖమేనీ కొంతవరకు నయం అని ఆయన అన్నారు. హర్మూజ్ జల సంధి తెరిస్తే.. కాల్పుల విరమణను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటివరకూ ఇరాన్‌పై దాడులు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. తొందరగా లొంగకపోతే ఇరాన్‌కు రాతి యుగం గతి పడుతుందని హెచ్చరించారు.